పిఠాపురం - Pithapuram

వైభవంగా కనకదుర్గమ్మ దసరా మహోత్సవాల పందిరిరాట

వైభవంగా కనకదుర్గమ్మ దసరా మహోత్సవాల పందిరిరాట

గొల్లప్రోలు పట్టణంలో బస్టాండ్ వద్ద కరణంగారి తోటలోని కనకదుర్గమ్మ అమ్మవారి దసరా శరన్నవరాత్రి మహోత్సవాల ముందస్తు వేడుకల్లో భాగంగా ఆదివారం పందిరిరాట మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు గుండ్ర సుబ్బారావు ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం వినాయక స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

జోగులాంబ గద్వాల జిల్లా