
మలేషియాలో జిల్లాకు చెందిన దంపతుల కష్టాలు
రాజమండ్రికి చెందిన వెంకటరమణ, పూజిత అనే దంపతులు ఆరు నెలల క్రితం ఉపాధి కోసం మలేషియా వెళ్లారు. పెదగంట్యాడ రామచంద్ర టెస్టింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా వెళ్లిన వీరికి, అక్కడ సరైన ఉపాధి లభించక, ఇద్దరు చంటి పిల్లలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక ఏజెంట్ ఉపాధి పేరుతో ఆశ చూపించి మోసం చేశాడని బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతూ వారు వీడియో పోస్ట్ చేశారు. ఈ విషయంపై స్పందించిన పోలీసులు, బాధితుల కష్టాలపై ఏజెంట్తో మాట్లాడుతున్నారు.





































