
తొర్రేడులో వైభవంగా అయ్యప్ప స్వామి మహా పడిపూజ
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ మండలం తొర్రేడులో బుధవారం మహా పడిపూజ అత్యంత వైభవంగా జరిగింది. చెరువు గట్టు వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై కురుకూరి కిషోర్ స్వామి, అశోక్ స్వామి ల అధ్వర్యంలో జరిగిన ఈ పూజలో వందలాది మంది స్వాములు పాల్గొని అయ్యప్ప స్వామికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. మురళీధరన్ నంబూద్రి గురు స్వామి ఆధ్వర్యంలో కేరళ తరహాలో పూజలు జరిగాయి. పడిపూజ అనంతరం రాజేష్ బృందం భజన స్వాములు భక్తి పారవశ్యంతో నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో స్వాములు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.






























