
సేవాభావం చాటుకున్న చిన్నారులు.. 100 మందికి అన్నసంతర్పణ
రాజానగరం మండలం పాతవెలుగుబంధ గ్రామంలోని చిన్న రామాలయం వద్ద మంగళవారం 'గజానన' కమిటీ ఆధ్వర్యంలో చిన్నారులు తమ సామాజిక దృక్పథాన్ని, సేవాభావాన్ని చాటుకున్నారు. స్థానిక చిన్నారులు 100 మంది పెద్దలకు తమ చేతులతో ప్రేమతో వంటకాలు వడ్డించి, ఘనంగా అన్నసంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సంఘటన చిన్నారుల గొప్ప మనసుకు నిదర్శనంగా నిలిచింది.


























