
కొబ్బరి చిప్పలో గణనాథుడి రూపాన్ని ఆవిష్కరించిన ఉపాధ్యాయుడు
రామచంద్రపురం మండలం హసన్ బాద ZPHS స్కూల్లో డ్రాయింగ్ ఉపాధ్యాయుడు జీ. శ్రీను తన సృజనాత్మకతతో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన కొబ్బరి కాయను నిలువుగా కట్ చేసి, దేవునికి సమర్పించే చిప్పలోనే గణనాథుడి రూపాన్ని ఆవిష్కరించారు. ఉపాధ్యాయుడి ఈ వినూత్న ఆలోచన, కళాత్మక నైపుణ్యాన్ని స్థానికులు, పాఠశాల విద్యార్థులు ఎంతగానో కొనియాడుతున్నారు.
































