
వాల్మీకి తెగ సమస్యలు పరిష్కరించాలని ఇంచార్జి కలెక్టర్ కి వినతి
రంపచోడవరం ITDA గ్రీవెన్స్ నందు అడ్డతీగల మండల దుచర్తి గ్రామ వాల్మీకి కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న వాల్మీకి తెగ సమస్యను దరఖాస్తు రూపంలో ఇచ్చి వివరించడమైనది. సదరు అధికారి సానుకూలంగా స్పందించి సంబంధించిన అధికారికి (తహసిల్దార్) పిలిచి విచారణ చేయటానికి లీగల్ సెక్షన్ నుండి పేపర్స్ తీసుకొని పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా వాల్మీకి అధ్యక్షులు గొర్లె చిన నారాయణ రావు, ఉద్యోగ సంఘ నాయకులు, యూత్ పాల్గొన్నారు.




































