
మినీ లోకల్ బాడీ ఎలక్షన్స్ను తలపిస్తున్న వాతావరణం
రాజోలు నియోజకవర్గం మామిడికుదురు మండలం గోగన్నమఠం గ్రామంలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నిక సర్వత్ర ఉత్కంఠం వాతావరణ మధ్య జరుగుతుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తును, విద్యా ప్రమాణాలను నిర్దేశించే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల (SMC) ఎన్నికల సమరం ముగింపు ఘట్టానికి చేరుకుంది. పాఠశాలల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే ఈ కమిటీల చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల కోసం అభ్యర్థులు, వారి మద్దతుదారులు ముమ్మరంగా ప్రయత్నాలు చేయడంతో గ్రామాల్లో రాజకీయ వేడి రాజుకుంది.




































