Oct 09, 2026, 15:10 IST/గద్వాల్
గద్వాల్
నేతువానిపల్లి తండాలో బాల్య వివాహాలపై అవగాహన ర్యాలీ
Oct 09, 2026, 15:10 IST
జోగులాంబ గద్వాల జిల్లా, గద్వాల్లోని నేతువానిపల్లి తండా ప్రాథమిక పాఠశాలలో జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో బాల్య వివాహాలు, బాల కార్మిక నిర్మూలనపై అవగాహన సదస్సు, ర్యాలీ శుక్రవారం నిర్వహించారు. సర్పంచ్ పద్మమ్మ వెంకటేష్ నాయక్ బాల్య వివాహ రహిత గ్రామంగా తీర్చిదిద్దాలని, ఆడపిల్లలకు 18, మగపిల్లాడికి 21 ఏళ్లు నిండాకే వివాహం చేయాలని, లేనిచో కఠిన చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పిల్లలను బడిలో చేర్పించి, 'బేటీ బచావో బేటీ పడావో' నినాదాన్ని పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీచర్ నాగరాజు, అంగన్వాడీ ఉమాదేవి, ఆశ పుల్లమ్మ పాల్గొన్నారు.