Oct 04, 2026, 12:10 IST/కొల్లాపూర్
కొల్లాపూర్
ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి
Oct 04, 2026, 12:10 IST
వనపర్తి జిల్లా చిన్నంబావి మండలంలోని లక్ష్మీపల్లి స్టేజి సమీపంలో ఆర్టీసీ బస్సు ఢీకొని సరోజమ్మ(57) అనే మహిళ మృతి చెందింది. లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన సరోజమ్మ కొల్లాపూర్ వెళ్లేందుకు రహదారి దాటుతుండగా, పెబ్బెరు నుంచి కొల్లాపూర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆమెను ఢీకొట్టింది. ఈ ఘటనలో సరోజమ్మ అక్కడికక్కడే మరణించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.