జగన్ కేసులో ఈడీ ఛార్జ్‌‌షీట్

45చూసినవారు
జగన్ కేసులో ఈడీ ఛార్జ్‌‌షీట్
ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై నమోదైన అక్రమాస్తుల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా మరో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టులో జగన్, దాల్మియా, ఇతర నిందితులపై ఈ పత్రాలను సమర్పించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలను ఈడీ ఈ ఛార్జ్ షీట్‌లో పేర్కొంది. గతంలోనే జగన్ మరియు దాల్మియా కంపెనీలకు చెందిన ఆస్తులను ఈడీ జప్తు చేసిన విషయం తెలిసిందే. సుమారు 15 ఏళ్లుగా ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్