ఏపీలో అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్.. SEC కీలక ఆదేశాలు

16చూసినవారు
ఏపీలో అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్.. SEC కీలక ఆదేశాలు
AP: స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ తక్షణమే అమలులోకి వచ్చింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఈ షెడ్యూల్‌ను ప్రకటించారు. ఓటర్లను ప్రభావితం చేసేలా ఎలాంటి కొత్త సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రాజెక్టులు ప్రకటించరాదని, అయితే ఇప్పటికే అమల్లో ఉన్న పథకాలకు ఆటంకం ఉండదని తెలిపారు. ప్రభుత్వ అధికారుల బదిలీలు, పదోన్నతులపై పూర్తి నిషేధం విధించారు. అత్యవసర పరిస్థితుల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతి తప్పనిసరి అని ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్