నేడు ఎన్నికల సంఘం కీలక సమావేశం

1చూసినవారు
నేడు ఎన్నికల సంఘం కీలక సమావేశం
AP: తిరుపతి కలెక్టరేట్‌లో నేడు రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక సమావేశం నిర్వహించనుంది. రాయలసీమ పరిధిలోని జిల్లాల ఎస్పీలతో ఎన్నికల కమిషన్ సమావేశమై గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై చర్చించనుంది. ఇటీవల కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఎన్నికల సంఘం అప్రమత్తమైంది. గతంలో జరిగిన ఘటనల నివేదికలను సమీక్షించడంతో పాటు, భవిష్యత్తులో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాల మోహరింపు, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లపై ఎస్పీలకు దిశానిర్దేశం చేయనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్