AP: రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ 365 కేంద్రాల్లో వేగంగా జరుగుతోంది. మొత్తం 9,062 కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేయగా, సగం బల్లలను జడ్పీటీసీలకు, మిగిలిన సగం ఎంపీటీసీల కోసం కేటాయించారు. ఒక టేబుల్‌కు 1,000 బ్యాలెట్ పత్రాల చొప్పున లెక్కింపు చేపడుతున్నారు. ఫలితం ఖరారై రిటర్నింగ్ అధికారి ఆమోదించిన తర్వాతే తదుపరి లెక్కింపు ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత తొలి
ఫలితాలు వెలువడే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు వెల్లడించారు.