విద్యుత్ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం

2చూసినవారు
విద్యుత్ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం
AP: ఎన్టీఆర్ జిల్లా నందిగామలో అసిస్టెంట్ లైన్‌మెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న గోపిరెడ్డి ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఇళ్లకు విద్యుత్ మీటర్లు అమర్చే నెపంతో అక్రమంగా నగదు వసూళ్లకు పాల్పడ్డాడంటూ ఆయనపై పలు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన గోపిరెడ్డి బలవన్మరణానికి యత్నించినట్లు సమాచారం. గమనించిన స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించగా.. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్