ఆచంట - Achanta

కారుణ్య ట్రస్ట్ అధినేత తుంగ నాగేశ్వరరావు జనసేనలో చేరిక

కారుణ్య ట్రస్ట్ అధినేత తుంగ నాగేశ్వరరావు జనసేనలో చేరిక

ఆచంట నియోజకవర్గంలో కారుణ్య ట్రస్ట్ అధినేత తుంగ నాగేశ్వరరావు జనసేన పార్టీలో గురువారం చేరారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా పేదలకు సహాయం అందిస్తూ గుర్తింపు పొందిన నాగేశ్వరరావు, ప్రజలకు మరింత చేరువగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలనే లక్ష్యంతో జనసేనలో చేరినట్లు తెలిపారు. జనసేన పార్టీ బలోపేతానికి, స్థానిక ఎన్నికలలో పార్టీ విజయానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ చేరిక ఆచంట నియోజకవర్గంలో ప్రాధాన్యత సంతరించుకుంది.

వీడియోలు


ఆదిలాబాద్ జిల్లా