మధుమేహాన్ని ప్రారంభంలో గుర్తిస్తే నివారణ సులభమవుతుందని వైద్యాధికారిణి డాక్టర్ మణిత్యాగి అన్నారు. అంతర్జాతీయ మధుమేహ వ్యాధి దినోత్సవ సందర్భంగా పోడూరు పీహెచ్ సీ లో నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడుతూ, మధుమేహం పై త్వరిత చర్య అనే నినాదంతో ముందుకెళ్ళాలని సూచించారు. సీహెచి రమేష్ రెడ్డి, హెల్త్ డెవలప్మెంట్ అధికారి సత్యనారాయణ, పీహెచ్ ఎన్ మీరమ్మ, హెచ్ ఓ లు పద్మకుమారి, సుధారాణి పాల్గొన్నారు.