విఆర్ఎలు చేపట్టిన సహాయ నిరాకారణ నిరసనలు 9వ రోజుకీ చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం పెనుమంట్ర ఎం ఆర్ ఓ ఆఫీస్ వద్ద నిరసన ప్రదర్శన చేశారు. విఆర్ఎ లకు పే స్కెల్ పెంచాలని, అర్హులైన విఆర్ఎ లకు వీఆర్వో లుగా ప్రమోషన్ ఇవ్వాలని ఆలాగే నామిని విఆర్ఎ లను రెగ్యులర్ చెయ్యాలని, ప్రభుత్వం ఇచ్చిన రెండు డిఏ లను విఆర్ఎ ల కొరకు అమలు చెయ్యాలని డిమాండ్ చేశారు.