
భీమవరంలో విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో బుధవారం విజ్ఞాన వేదిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఒక సామాజిక సేవా కార్యక్రమం జరిగింది. భీమవరానికి చెందిన మెడికల్ విద్యార్థి మోహిత్ తన తండ్రి షేక్ పాదుషా పుట్టినరోజు సందర్భంగా ప్రకాష్ నగర్ కాలనీలో నివసించే యానాదులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో న్యూ ఆంధ్రా బాడీ బిల్డర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి షేక్ ఖాసీం, అల్లు శ్రీనివాస్, పెన్మెత్స రవి వర్మ, వాల్మీకి బాలాజీ మరియు ఎస్. కె చాన్ తదితరులు పాల్గొన్నారు.


































