
గండి జర్ల ఎంపీటీసీగా టీడీపీ అభ్యర్థి గగన సింధు నామినేషన్
ఏలూరు జిల్లా, చింతలపూడి మండలం గండి జర్ల ఎంపీటీసీ స్థానానికి టీడీపీ తరపున యువ న్యాయవాది గగన సింధు గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ప్రముఖ టీడీపీ నాయకులు చీకటి వెంకటేశ్వరరావు కుమార్తె అయిన గగన సింధు, నామినేషన్ అనంతరం మాట్లాడుతూ యువతరం రాజకీయాల్లో చురుగ్గా పాల్గొని, చంద్రబాబు నాయుడు చేపడుతున్న అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలకు మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. పాత విధానాలను వీడి యువత అగ్రస్థానంలో నిలవాలని ఆమె ఆకాంక్షించారు.






































