ఏలూరు జిల్లా, ద్వారక తిరుమల మండలం, IS రాఘవపురం గ్రామంలో కొబ్బరి చెట్టు నుంచి కిందపడి తీవ్రంగా గాయపడిన రాజులపాటి రామకృష్ణను ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు శనివారం పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే, బాధితుడి అబ్బాయికి ఉద్యోగం ఇప్పించి, రూ. 50 వేల ఆర్థిక సహాయం అందించారు. రామకృష్ణ పూర్తిగా కోలుకునే వరకు వైద్య సహాయం అందిస్తానని భరోసా ఇచ్చారు. ఈ సంఘటన ఎమ్మెల్యే మానవత్వాన్ని చాటుకుంది.