
మానసిక ఆరోగ్యంపై చాటపర్రు ఆసుపత్రిలో అవగాహన కార్యక్రమం
ఏలూరులోని జిల్లా దివ్యాంగుల పునరావాస కేంద్రం వారు శుక్రవారం చాటపర్రు సర్వజన ఆసుపత్రిలో 'ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డా. ప్రదీప్ చంద్ర మాట్లాడుతూ విపత్తులు, ఆపత్కాలంలో మానసిక ఆరోగ్య సేవలకు ప్రాధాన్యత ఇవ్వాలని, శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా సంపూర్ణ ఆరోగ్యానికి అత్యంత కీలకమని నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమంలో డి.డి.ఆర్.సి సిబ్బంది పాల్గొన్నారు.

























