
నామినేషన్ కేంద్రాల వద్ద పూర్తి స్థాయి బందోబస్తు - డిఎస్పి
నరసాపురం డివిజన్ లోని ఎనిమిది మండలాల్లో ఎంపీటీసీ నామినేషన్ కేంద్రాల వద్ద పూర్తిస్థాయి బందోబస్తు నిర్వహిస్తున్నామని డిఎస్పి మేక సుధాకర రావు అన్నారు. మొగల్తూరులోని మండల పరిషత్ కార్యాలయం ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని సీఐ ఎం నాగరాజు, ఎస్ఐ వాసులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీ సంఘటన జరగకుండా బందోబస్తు నిర్వహించాలని సూచించారు.





































