
ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య
ఏలూరు జిల్లా టీ నర్సాపురం మండలం వీరభద్రవరం గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం శాంతి (27) అనే వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఏడేళ్ల క్రితం శేషుతో శాంతికి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఆమె ఈ దారుణానికి ఒడిగట్టినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



























