తాడేపల్లిగూడెం(ప.గో) - Tadepalligudem

అలంపురంలో శ్రీ వెంకటరమణ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు

అలంపురంలో శ్రీ వెంకటరమణ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు

పెంటపాడు మండలం అలంపురం గ్రామంలో శ్రీ వెంకటరమణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు నియోజకవర్గ శాసనసభ్యులు పత్సమట్ల ధర్మరాజు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, 100 పడకల ఉచిత ఆసుపత్రి, వృద్ధుల కోసం ఆనంద నిలయం, ఉచిత స్వయం ఉపాధి కేంద్రం, ఉచిత అన్నప్రసాద కేంద్రం నిర్మాణాలకు సంబంధించిన స్థలాన్ని పవిత్రం చేసేందుకు భూమిని నాగలితో దున్ని, నవధాన్యాలు చల్లే కార్యక్రమం నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ గో పూజ, గణపతి పూజ, పుణ్యాహవాచనం వంటివి బ్రహ్మశ్రీ రెడ్డి దుర్గా మహేష్ వరి బ్రహ్మత్వంలో జరిగాయి.

వీడియోలు


ఆదిలాబాద్ జిల్లా