
వేల్పూరు మాజీ సర్పంచ్ దత్తుడు మృతి
తణుకు మండలం వేల్పూరు గ్రామ మాజీ సర్పంచ్ పెనుమర్తి సోమ సూర్యచంద్రరావు (దత్తుడు) మంగళవారం రాత్రి మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణకు దత్తుడు బాబాయి కాగా ఆయన భార్య పెనుమర్తి వెంకటలక్ష్మి గ్రామ సర్పంచిగా పని చేశారు. దత్తుడు మృతి పట్ల పలువురు సంతాపం తెలియజేశారు.

























