దుర్వాసనతో ఉండి పంట కాలువ

4చూసినవారు
దుర్వాసనతో ఉండి పంట కాలువ
ఉండి మండలంలోని పంటకాలువ కాలుష్యం కాసారంగా మారిపోయింది. మహాదేవపట్నం దగ్గర పంట కాలువ పరిస్థితి దయనీయంగా వుందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. వరుస తుఫాన్లుతో కాలువలో కూలిపోయిన వృక్షాలు అలాగే పడి ఉండటం. దీనికి తోడు జంతు కళేబరాలు కొట్టుకొచ్చి ఆగిపోవడంతో తీవ్ర దుర్వాసన వెదజల్లుతోందని చెబుతున్నారు. పడిపోయిన చేట్లు, కొట్టుకొచ్చిన జంతు కళేబరాలు, వ్యర్ధాలను తొలగించాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్