ఏపీయూడబ్ల్యూజే యూనియన్ వార్షికోత్సవ వేడుకలు

1321చూసినవారు
ఏపీయూడబ్ల్యూజే యూనియన్ వార్షికోత్సవ వేడుకలు
ఏపీయూడబ్ల్యూజే యూనియన్ 70వ వార్షికోత్సవం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో జర్నలిస్టులు వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నంద్యాల లక్ష్మీసీతారామయ్య, అంబటి రమేష్ మాట్లాడుతూ, జర్నలిస్టులు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తున్నారని తెలిపారు. అయితే, జర్నలిస్టులు అనేక సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని, ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలను వారికి అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కె. ప్రసాద్, కె. పౌల్, బిఆర్ కోటేశ్వరావు, కిమిడి సుబ్బారావు, నాగులపల్లి అశోక్, చింతా ఆదిశేషు, బిసియన్ శ్రీనివాస్, జోగి ఉదయ్, సర్కార్, రమేష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్