ఉండి మండలం పాందువ గ్రామంలో రాజ్యాంగ దినోత్సవాన్ని గురువారం నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. kvps నాయకులు మాదాసి గోపి మాట్లాడుతూ 1949 నవంబర్ 26 భారత రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజన్నారు. ప్రపంచంలో భారత రాజ్యాంగం అతిపెద్ద లిఖిత రాజ్యాంగమని తెలిపారు. ప్రశాంత్, రామయ్య, కాసులు, శ్రీను, వినయ్, సుబ్రహ్మణ్యం, మహి సూరి, నాగేంద్ర, నాగరాజు, నర్సులు, గ్రామస్తులు పాల్గొన్నారు.