ఉండిలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహణ

3చూసినవారు
ఉండిలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహణ
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడలో గురువారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని సూర్యనారాయణరాజు ప్రారంభించగా లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ నారాయణరెడ్డి మాట్లాడుతూ మానవ శరీరంలో కన్ను అత్యంత కీలకమైనదని, అందరూ కళ్ళ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నరసరాజు, డాక్టర్ రంగరాజు రామకృష్ణ పల్లాలరాజు పాల్గొన్నారు. మొత్తం 150 మందికి పరీక్షలు చేయగా 70 మందికి కళ్ళజోళ్లను వైద్యులు సిఫార్సు చేశారు.

సంబంధిత పోస్ట్