భీమవరంలోని జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో ఉండి మండల జెడ్పిటీసీగా పీవీఎల్ నరసింహరాజు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. యండగండి గ్రామానికి చెందిన నరసింహరాజు తన సమీప ప్రత్యర్థిపై భారీ మెజార్టీతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. తనను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన నరసింహరాజు, ఉండి మండలంలోని గ్రామాల మౌలిక సదుపాయాల కల్పనకు నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.