గత సర్వే సమస్యలు పరిష్కరించి త్వరలో కొత్త పట్టాదార్ పాస్ పుస్తకములు జారీ చెయ్యటానికి సిద్ధంగా ఉన్నామని ఉండి మండల తహసీల్దార్ మంతెన రామ్ ప్రసాద్ రాజు అన్నారు. ఉండి మండల కోలమూరు గ్రామంలో గురువారం గ్రామ స్థాయిలో విలేజ్ సర్వేయర్ లు, VRO లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పలు అంశాలను VRO సమీక్షించారు. సబ్ డివిజన్స్ , కరెలేషన్, షేప్ ఫైల్ తదితర అంశాలను ఆయన ప్రస్తావించారు. రైతులు ఇందుకు సహకరించాలని కోరారు. RDT. K. సూర్యనారాయణరాజు, VRO విజయలక్ష్మి, VS. సాయి, ఖాదర్, రమేష్, ప్రవల్లిక తదితరులు పాల్గొన్నారు.