ముందస్తు జాగ్రత్తలు తీసికోండి - జేసి కల్పనశ్రీ

5చూసినవారు
ముందస్తు జాగ్రత్తలు తీసికోండి -  జేసి కల్పనశ్రీ
అత్యవసర పరిస్థితి తలెత్తితే వెంటనే స్పందించాలని జిల్లా జేసి కెఆర్ కల్పనశ్రీ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఉండి మండలం యండగండి గ్రామంలో ఉన్న లాకులను ఆమె శుక్రవారం పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ, వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఇరిగేషన్ శాఖ అధికారులను, తహసీల్దార్ ను కోరారు. వరద నీటి ప్రవాహం, లాకుల పరిస్థితిని నిరంతరం గమనిస్తూ అవసరమైన ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్