
కూటమి ఎంపీపీ అభ్యర్థిగా అక్కిన నాగమణి
ఉంగుటూరు మండలంలో గురువారం ఎన్డీఏ కూటమి తరపున ఎంపీపీ అభ్యర్థిగా, నారాయణపురం-1 ఎంపీటీసీ అభ్యర్థిగా అక్కిన నాగమణి నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా నారాయణపురం సాయిబాబా ఆలయం నుండి ఎంపీడీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, ఏపీక్యాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు పాల్గొని సందడి చేశారు. జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
























