ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలంలో 23 ఎంపీటీసీ మరియు ఒక జడ్పీటీసీ స్థానానికి గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 79 కేంద్రాల్లో 64,045 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కూటమి,
వైసీపీ మరియు
బీజేపీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. నారాయణపురంలో పోలింగ్ మొదలైంది. ఏజెంట్లు ఆలస్యంగా రావడం వల్ల కొన్ని కేంద్రాల్లో పది నిమిషాల ఆలస్యంగా ఓటింగ్ మొదలైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుందని అధికారులు తెలిపారు.