AP: అనకాపల్లి జిల్లాలోని ఏఎంఏఎల్ కళాశాల కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. మునగపాక మండలం సిరసనపల్లిలో
వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థి 17 ఓట్ల తేడాతో గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. అయితే రీకౌంటింగ్ నిర్వహించాలని కూటమి అభ్యర్థి డిమాండ్ చేయడంతో ఇరువర్గాల నేతల మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు.