AP: వైఎస్ఆర్ కడప జిల్లాలోని నందలూరు మండలంలో వెంకట రాజంపేట గ్రామానికి చెందిన చింతకాయల వెంకటరతయ్య (40) విద్యుత్ షాక్తో మృతి చెందాడు. పొలంలోని కరెంటు మోటార్ గదిలోకి వెళ్లినప్పుడు వేలాడుతున్న విద్యుత్ తీగలు తగలడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. నందలూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.