ఆంధ్రప్రదేశ్లో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల అభ్యర్థుల తుది జాబితా విడుదలైంది. 27 జిల్లాలు, 52 రెవెన్యూ డివిజన్లు, 246 మండలాల్లో ఎన్నికల పోరు జరగనుంది. విశాఖపట్నం మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో రెండో విడత
ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం 4,975 సర్పంచి స్థానాలకు గాను 1,171 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 3,803 స్థానాలకు పోలింగ్ జరగనుంది. సర్పంచి పదవుల కోసం మొత్తం 10,292 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.