ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో ఆసక్తికరమైన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. తిరుపతి జిల్లా ఓజిలి మండలం రావిపాడులో జరిగిన ఎన్నికల్లో
వైసీపీ మద్దతుతో బరిలో నిలిచిన ఎల్లసిరి కృష్ణయ్య తన కుమారుడు వెంకటేశ్వర్లుపై 236 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మరోవైపు, మార్కాపురం జిల్లా అల్లినగరంలో 10వ వార్డులో ఇద్దరు అభ్యర్థులకు సమాన ఓట్లు రావడంతో, అధికారులు లాటరీ పద్ధతి ద్వారా నిర్ణయం తీసుకున్నారు. ఇందులో కావేరి అనే అభ్యర్థి విజేతగా నిలిచారు.