ఫీజు రీయింబర్స్‌మెంట్‌ స్కీమ్‌ను నిర్వీర్యం చేస్తున్నారు: జగన్

12చూసినవారు
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ స్కీమ్‌ను నిర్వీర్యం చేస్తున్నారు: జగన్
AP: సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌పై వైసీపీ అధినేత జగన్‌ తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం ఎక్స్ వేదికగా.. ‘ఫీజు రీయింబర్స్‌మెంట్‌ స్కీమ్‌ను నిర్వీర్యం చేస్తున్నారు. పెండింగ్‌ బకాయిలను వెంటనే చెల్లించాలి. చిత్తూరులో విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి కారణం మీరు కాదా? ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకానికి మీరిద్దరూ మీ చేతులతో ఉరితాడు బిగిస్తే, అదే ఉరితాడు ఇప్పుడు అమాయక విద్యార్థుల ప్రాణాల మీదకు వస్తోంది. ఈ దారుణమైన పరిస్థితికి ముమ్మాటికీ మీరే బాధ్యులు’ అని ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్