కేజీహెచ్‌లో మహిళా సెక్యూరిటీ గార్డు ఆత్మహత్యాయత్నం

20చూసినవారు
కేజీహెచ్‌లో మహిళా సెక్యూరిటీ గార్డు ఆత్మహత్యాయత్నం
AP: విశాఖలోని కింగ్‌ జార్జ్‌ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డు సంతోషి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గత మూడు నెలలుగా వేతనాలు చెల్లించకుండా కార్తికేయ సెక్యూరిటీ యాజమాన్యం వేధిస్తోందని కార్మికులు ఆరోపించారు. జీతాలు, ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యాల కోసం డిమాండ్ చేసిన ముగ్గురు మహిళా గార్డులను సోమవారం నుంచి విధుల్లోంచి తొలగించారని సీఐటీయూ నేత చంద్రశేఖర్ పేర్కొన్నారు. నిరసన తెలిపినా అధికారులు స్పందించకపోవడంతో మనస్తాపం చెంది సంతోషి మాత్రలు మింగారని, ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్