ap: MPTC, ZPTC ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల తుది జాబితా విడుదలైంది. రాష్ట్రవ్యాప్తంగా 9,829 MPTC స్థానాలకు
ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానాల్లో పోటీ చేసేందుకు మొత్తం 46,045 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మరోవైపు, 659 ZPTC స్థానాలకు
ఎన్నికలు నిర్వహించనున్నారు. ZPTC స్థానాలకు సంబంధించి 4,770 మంది అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటైనట్లు అధికారులు వెల్లడించారు. తుది జాబితా విడుదలతో ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టం పూర్తయింది. ఇక ఆయా స్థానాల్లో అభ్యర్థుల మధ్య పోటీ నెలకొననుంది. ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.