ఏపీలో జరిగిన సర్పంచ్ ఎన్నికల తొలి విడతలో కూటమి అభ్యర్థులు భారీ విజయాన్ని నమోదు చేశారు. మొత్తం 3,949 స్థానాలకు
నోటిఫికేషన్ జారీ కాగా, 760 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. పోలింగ్ జరిగిన 3,189 స్థానాలతో కలిపి కూటమి మద్దతుదారులు 2,534 చోట్ల విజయం సాధించగా, అందులో
టీడీపీ 2,321,
జనసేన 188,
బీజేపీ 25 స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఇక
వైసీపీ మద్దతుదారులు 1,103 స్థానాల్లో గెలుపొందగా, స్వతంత్రులు, ఇతరులు 295 స్థానాల్లో విజయం సాధించారు. మిగిలిన స్థానాల
ఫలితాలు వెలువడాల్సి ఉంది.