AP: ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల వేదికగా విశాఖ జీవీఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం జరిగిన పోలింగ్లో 56.32 శాతం ఓట్లు నమోదయ్యాయి. 8 నియోజకవర్గాల్లోని 10 జోన్ల పరిధిలో ఉన్న 120 వార్డులకు సంబంధించి ఉదయం 11 గంటలకే తొలి ఫలితం వెల్లడికానుందని అధికారులు తెలిపారు. గత 2021 ఎన్నికల్లో 59.41 శాతం పోలింగ్ నమోదు కాగా, ఈసారి ఓటర్లు కార్పొరేటర్ మరియు మేయర్ అభ్యర్థులకు విడివిడిగా రెండేసి ఓట్లు వేశారు.