AP: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో తొలి ఫలితం వెలువడింది. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం కరిడివారిపల్లిలో
వైసీపీ బలపరిచిన అభ్యర్థి రాఘవరెడ్డి విజయం సాధించారు. ఆయనకు 483 ఓట్లు వచ్చాయి.
టీడీపీ అభ్యర్థికి కేవలం 34 ఓట్లు మాత్రమే వచ్చాయి. మరోవైపు కడప జిల్లా రావులకొలనులోనూ
వైసీపీ బలపరిచిన అభ్యర్థి మల్లికార్జున యాదవ్ 542 ఓట్లతో గెలిచారు.