తొలుత పోస్టల్‌ బ్యాలట్‌ పత్రాల లెక్కింపు...

3చూసినవారు
తొలుత పోస్టల్‌ బ్యాలట్‌ పత్రాల లెక్కింపు...
AP: ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో భాగంగా మొదటగా పోస్టల్‌ బ్యాలెట్లను లెక్కిస్తారు. లెక్కింపు సమయంలో వచ్చిన ప్రతి కవరును తెరిచి, లోపల ఉన్న డిక్లరేషన్‌ పత్రాన్ని నిశితంగా పరిశీలిస్తారు. డిక్లరేషన్‌ లేకపోయినా, సంతకం లేదా అటెస్టేషన్‌ లోపించినా, అలాగే బ్యాలెట్‌ నంబర్లు సరిపోలకపోయినా ఆ ఓట్లను తిరస్కరిస్తారు. నిబంధనల ప్రకారం ఉన్న డిక్లరేషన్లను వేరు చేసి సీల్‌ చేస్తారు. చివరగా, చెల్లుబాటయ్యే ఓట్లను లెక్కించి, అభ్యర్థుల వారీగా ఫలితాలను అధికారికంగా ప్రకటిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్