AP: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన 'అర్నబ్' అతి తీవ్ర తుఫాన్‌గా మారి ఏపీ వైపు దూసుకొస్తోంది. బుధవారం ఉదయంలోపు బాపట్ల-విశాఖ మధ్య యానాం సమీపంలో ఇది తీరం దాటే అవకాశం ఉందని IMD అంచనా వేసింది. రేపు సాయంత్రం 5.30 గంటల్లోగా ఏపీలో బాపట్ల, గుంటూరు, కృష్ణా, కాకినాడ, కోనసీమ, విశాఖ, అనకాపల్లి, శ్రీకాకుళం సహా 15 జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు, వంకలు దాటొద్దని సూచించింది.