AP: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ప్రాంతానికి వరద ముప్పు పొంచి ఉంది. యనమదుర్రు డ్రెయిన్ ఉధృతంగా ప్రవహిస్తుండగా, పాలకోడేరు సమీపంలో గోస్తనీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరద నీరు పాలకోడేరు విద్యుత్ సబ్‌స్టేషన్‌ను చుట్టుముట్టింది. దీంతో అప్రమత్తమైన అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.