AP: ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలానికి అధికారులు వరద హెచ్చరిక జారీ చేశారు. పెదవాగు నుంచి వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉందని, ముంపు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముంపు గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలన్నారు. పొంగుతున్న వాగులు, రోడ్లు దాటే ప్రయత్నం చేయవద్దని సూచించారు.