వరద ఉధృతి.. 10 కి.మీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ (వీడియో)

13చూసినవారు
AP: శ్రీకాకుళం జిల్లాలో బాహుదా నదికి వరద ఉధృతి కొనసాగుతోంది. ఇచ్చాపురం హైవేపైకి భారీగా వరద నీరు చేరడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దాదాపు 10 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. నరసన్నపేట, టెక్కలి, పలాస హైవేలపై అధికారులు వాహనాలను నిలిపివేస్తున్నారు. నరసన్నపేట వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. వరద ఉధృతి తగ్గే వరకు వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్