AP: శ్రీకాకుళం జిల్లాలో నాగావళి, వంశధార, బహుద నదులు వరద పోటుతో ఉప్పొంగుతున్నాయి. నాగావళి నదిలో ఇన్ఫ్లో, ఔట్ఫ్లో 59,700 క్యూసెక్కులుగా, వంశధారలో ఇన్ఫ్లో 41,425, ఔట్ఫ్లో 42,926 క్యూసెక్కులుగా, బహుద నదిలో 34,656 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. నదుల ఉధృతి నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన కలెక్టర్, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.